పట్టిష్టంగా దళిత బంధు: సీఎం కేసీఆర్

242
CM KCR
- Advertisement -

ప్రభుత్వం తీసుకురాబోతున్న దళిత బంధు పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో సమావేశం అయిన సీఎం..పలు సూచనలు చేశారు.

మనలో నిబిడీకృతమై వున్న పులి లాంటి శక్తి ని గుర్తించి ముందుకు సాగాలన్నారు. విజయం సాధించాలంటే దళారులు, ప్రతీప శక్తులను దూరం ఉంచాలని…దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగం లోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుంది…. సర్కారే స్వయంగా అండగా వున్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలన్నారు.

ప్రభుత్వ వర్గాలతో పనితీసుకునే క్రమం లో నేటి సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా వర్గం గా డేగ కన్నుతో పనిచేయాలి …పథకం పటిష్ట అమలుకు మమేకమై పని చేయాలన్నారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధి కి అవకాశం వుండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందన్నారు. ఆర్థికాభివృద్ధి కి అవకాశం వుండే ఇతర రంగాలను గుర్తించాలని, వాటిలో దళితులకు రిజర్వేషన్ లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -