KCR:కాంగ్రెస్,బీజేపీకి డిపాజిట్లు రావొద్దు

47
- Advertisement -

కాంగ్రెస్,బీజేపీ నేతలకు డిపాజిట్లు కూడా రావొద్దన్నారు సీఎం కేసీఆర్. చెన్నూరు ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…ఈ ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీని చూసి ఓటు వేయాలన్నారు.మీ ఓటు ఐదే ఏళ్ల భవిష్యత్‌ని నిర్ణయిస్తుందన్నారు. తమాషా కోసం ఓట్లు వేస్తే జీవితాలు ఆగమాగం అవుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ల ముందే ఉందన్నారు. బీఆర్ఎస్‌కు బాస్ ఢిల్లీలో లేరని….ప్రజలే మా బాస్ అన్నారు.

బీఆర్ఎస్ 24 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసమన్నారు. గత కాంగ్రెస్ ఏం చేసింది…బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించాలన్నారు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు సీఎం.తెలంగాణ వచ్చే నాటికి కరెంట్, నీటి సరఫరా లేక ఇబ్బందులు, రైతులు, చేనేతల ఆత్మహత్యలతో అల్లాడిపోయామన్నారు. కానీ ఈ పదేళ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మీ కళ్ల ముందే ఉందన్నారు.

సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నారు.రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. సింగరేణిని కేంద్రానికి తాకట్టు పెట్టిందే కాంగ్రెస్ అని…అప్పు తీర్చలేక 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టిందే కాంగ్రెస్ అన్నారు. సింగరేణిని అమ్మింది కాంగ్రెస్ కాదా ఆలోచించాలన్నారు. దసరా, దీపావళి బోనస్ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. అందుకే పార్టీల గురించి ఆలోచించి ఓటు వెయ్యాలని లేకుంటే నష్టపోతామన్నారు. సింగరేణిలో 45 వేల మందికి పట్టాలిచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డిపెండెంట్ ఉద్యోగాలు తిరిగి తెచ్చామన్నారు. సింగరేణి కార్మికులు ఇళ్లు కట్టుకుంటామంటే రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ఇస్తున్నామన్నారు.

Also Read:జుట్టు రాలిపోతోందా..ఈ చిట్కాలు మీకోసమే!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేటైజేషన్‌ పిచ్చి పట్టుకుందన్నారు. చివరికి బొగ్గును కూడా ప్రైవేటైజేషన్‌ చేశారన్నారు. రైతు బంధు, దళిత బంధు పుట్టించిందే బీఆర్ఎస్ సర్కార్ అన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని వారికి బుద్ది చెప్పాలన్నారు. బాల్క సుమన్ నిఖార్సైన ప్రజా నాయకుడన్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలు కెళ్లారన్నారు. ప్రజలకు ఆపద, సంపదలో అందుబాటులో ఉండే వ్యక్తి సుమన్ అన్నారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసే వ్యక్తికి ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకొస్తారన్నారు.

- Advertisement -