CM KCR:24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ రావాలి

41
- Advertisement -

రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్నారు సీఎం కేసీఆర్. ములుగు జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, ఆ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ గురించి ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఓటు వజ్రాయుధం అని..అది సద్వినియోగపర్చుకుంటేనే ప్రజలకు మంచి జరగుతుందన్నారు.

కాంగ్రెస్ పాలనలో రూ.200 పెన్షన్ ఉంటే దానిని ప్రస్తుతం రూ. 2 వేలకు తీసుకుపోయామని ఎన్నికల తర్వాత రూ. 5 వేలు అందిస్తామన్నారు. పేదల ఆరోగ్యం కోసం కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చామన్నారు.కాంగ్రెస్ పాలనలో కరువు, నిరుద్యోగం ఉండేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.సమ్మక్క సారలమ్మ కొలువై ఉన్న ఈ నేలకు వందనం తెలిపారు.

విధి వంచితులకు ప్రభుత్వం అండగా ఉండాలని..అందుకే పెన్షన్ తీసుకొచ్చామని వెల్లడించారు.ఎవరు అధికారంలో ఉంటే అందరికి న్యాయం జరుగుతుందో ఆలోచించాలన్నారు.50 ఏండ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది..10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రజల ముందే ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కనీసం సాగునీటిని అందించలేదన్నారు. 24 గంటలు దేశంలో కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

దేశంలో రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ అన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లో రైతు భీమా అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధు దుబారా అని మాట్లాడుతున్నారని..బడే నాగజ్యోతిని గెలిపస్తే రైతు బంధు రూ.16 వేలు ఇస్తామన్నారు.

Also Read:CM KCR:మంచిర్యాలను మరింత అభివృద్ధి చేస్తాం

- Advertisement -