CM KCR:మంచిర్యాలను మరింత అభివృద్ధి చేస్తాం

43
- Advertisement -

ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. మంచిర్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…సింగరేణి కార్మికులకు బోనస్, లాభాల్లో వాటా ఇచ్చామన్నారు సీఎం. గతంలో కాంగ్రెస్ హయాంలో సింగరేణి కార్మికుల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. స్ధానిక ఎమ్మెల్యే దివాకర్ రావు సౌమ్యుడు, మంచి చేసే వాడన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే పేకాల క్లబ్‌లు వస్తాయన్నారు.

పదేళ్ల కష్టపడి తెలంగాణను ఓ దారిలోకి తెచ్చామని తెలిపారు. అన్నిరకాలుగా ప్రజలకు సేవా చేశామన్నారు. ఎల్లమ్మ కూడబెడితే మల్లమ్మ నాశనం చేసినట్లు మరోసారి బీఆర్ఎస్‌నే ఆశీర్వదించాలన్నారు. దివాకర్ ఏనాడూ వ్యక్తిగత పనులకోసం రాలేదన్నారు. మంచి వ్యక్తి గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. గోదావరి కరకట్ట కట్టి తీరుతామన్నారు. మంచిర్యాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు.

75 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో రావాల్సినంత పరిణతి రాలేదని…ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలన్నారు. తెలంగాణ వచ్చాక సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెడ్లలాగా పరుగులు పెట్టించామన్నారు.కాంగ్రెస్ పాలనలో రూ.200 పెన్షన్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దానిని రూ.2 వేలకు పెంచామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక దానిని రూ.5 వేలకు తీసుకుపోతామన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని…రైతు బంధు ఉండాలంటే దివాకర్ రావు గెలిచి తీరాలన్నారు.

Also Read:Boyapati:బోయపాటి పనైపోయిందా?

- Advertisement -