రేపు కొనాయిపల్లిలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ప్రతి ఎన్నికల నామినేషన్లకు ముందు అక్కడి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించే ఆనవాయితీని కొనసాగిస్తున్న సీఎం…అక్కడి దేవాలయంలో కొలువై ఉన్న స్వామి వారి ముందు తన నామినేషన్ పాత్రలు ఉంచిప్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఆ తరవాత 9 వ తేదీన గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఇక నామినేషన్ అనంతరం కామారెడ్డిలో జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికి నుండి ఇప్పటివరకు ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఈ వెంకటేశ్వరస్వాయి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేస్తున్నారు. అన్ని సందర్భాల్లో కేసీఆర్ విజయం సాధించారు. ఇక 2001లో టీడీపీకి, శాసన సభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఈ ఆలయంలోనే పూజలు నిర్వమించిన గులాబీ పార్టీని ప్రకటించారు.
Also Read:CM KCR:ముగిసిన రాజశ్యామల యాగం

