- Advertisement -
ప్రముఖ జర్నలిస్టు, రచయిత,సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత టంకశాల అశోక్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు సీఎం కేసీఆర్. అంతరాష్ట్ర అంశాల సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు.
పూర్తి పేరు టంకశాల అశోక్ వసంతరావు. వరంగల్ జిల్లా కు చెందిన టంకశాల జనధర్మ,ఆంధ్ర జనత, నవ్యాంధ్ర ,ఈనాడు,ఆంధ్రభూమి,ఉదయం,ఆంధ్రప్రభ,వార్తలలో దాదాపు నలభై ఐదేళ్ల పాటు పనిచేశారు.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జె.ఎన్.యు.), న్యూఢిల్లీ, లో ముందు చైనీస్ భాష నేర్చుకోవడానికి చేరారు. తర్వాత ఆఫ్రికన్ స్టడీస్ లో అక్కడే ఎం.ఫిల్. చేశారు.2016 సంవత్సరానికి అనువాద పుస్తకాలకు సంబంధించి తెలుగులో ఆయన రాసిన ‘వల్లభాయ్ పటేల్’ పుస్తకానికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.
- Advertisement -