CM KCR:ధార్మిక సమాచార కేంద్రంగా బ్రహ్మణ సదన్

32
- Advertisement -

బ్రహ్మణ సదన్ దేశానికే ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌ గోపనపల్లిలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నెల 31న తెలంగాణ బ్రాహ్మణ్ సదన్…సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్.

అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమవుతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉన్నదని సీఎం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సమగ్రరీతిలో సమస్త ఆధ్యాత్మిక ధార్మిక సమాచార కేంద్రంగా పరిఢవిల్లాలని సీఎం ఆకాంక్షించారు. ఆధ్యాత్మాక సాహిత్యానికి, క్రమతువులకు సంబంధించిన సమాచారాన్ని దేశం నలుమూలల నుంచి సేకరించి పుస్తకాలు, డిజిటల్ రూపంలో భధ్రపరచి అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు.

Also Read:శ్రీముఖి వాదన భలే ఉందే !

తెలంగాణ ఆధ్యాత్మిక తెలంగాణగా మారిందని, దేవాలయాల పునరుజ్జీవంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయన్నారు.దాంతో ఇతర రాష్ట్రాలనుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం అర్చకులు పురోహితులు వేద పండితులు వలస వస్తున్నారని సీఎం తెలిపారు. అన్నివర్గాలతో పాటు నేడు తెలంగాణ బ్రాహ్మణులకు ఉపాధి కేంద్రంగా మారిందన్నారు.

Also Read:CMKCR:మోదీ ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నారు

- Advertisement -