జనసమూహం ఉండకుండా చూడండి- సీఎం కేసీఆర్

493
kcr on corona
- Advertisement -

రాష్ట్రంలో కారోనా వైరస్‌ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మంత్రులు, అన్ని జిల్లాల కల్లెక్టర్లు, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఈ కరోన వైరస్ సంబంధించి నిన్న కరీంనగర్ జరిగిన ఉదంతం దృష్ట్యా ఇవాళ అన్ని జిల్లాల పోలీస్,కలెక్టర్ లను పిలిచి ఏవిధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 14 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 5 మాత్రమే హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు మిగతా వారు అంత ఇతర మార్గాల ద్వారా వచ్చారు. కరీంనగర్ వచ్చిన వారు మత ప్రచారం కోసం వచ్చారు వారిని అందరిని మన డాక్టర్ల ఆధీనంలో ఉన్నారు. చైనా పక్కనే ఉన్న వియత్నాం చైనాలో వచ్చిన తరువాత కట్టడి చేసుకున్నారు. కానీ ఇటలీ మాత్రం కట్టడి చేయలేకపోయారు. అయితే ఇవ్వన్నీ దృష్టిలో ఉంచుకొని మార్చ్ ఒకటవ తేదీ నుండి ఇతర దేశాల నుండి వచ్చిన వారు వారికి వారే సరెండర్ కావాలి లేదంటే మా పోలీస్ శాఖ వారిని గుర్తిస్తుందని తెలిపారు.

ఇప్పటికే అన్ని గ్రామాల్లో పోలీస్ అధికారులను నియించారు కాబట్టి ఇబ్బందులు లేవు. విదేశాల నుండి వచ్చిన వారు వారే వచ్చి జాయిన్ కావాలి. బహిరంగ సమావేశాలు,సభలు,ర్యాలీ లు అనుమతి లేదు, దేవాలయలు,మజీద్ లు,చర్చి లు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదు.మనుషులను ఎట్టిపరిస్థితుల్లోనూ రనివ్వవద్దు. ఒక్కదగ్గర మనుషులు జమ కావద్దు. ఈనెల 22 తేదీ నాడు ముస్లిం పండుగ ఉంది దాన్ని కూడా వద్దు అని చెప్పారు. ఉగాది ,శ్రీరామ నవమి వేడుకలు కూడా రద్దు చేశాం వాటిని లైవ్ ద్వారా చూడవచ్చు.పబ్లిక్ సర్వీస్ లలో శానిటైజర్ ఎక్కువగా వాడాలి సూచించారు.

kcr on corona

గ్రామాల్లో,మండలాల్లో శానిటేషన్ పెంచాలి,విదేశలా నుండి వచ్చిన వారిని గుర్తించి హోమ్ క్వారైటైన్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇండ్లలో హోమ్ క్వారయింటైన్ వెళ్తాము అంటే పంపిస్తాం అంతేకాదు వారిపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుంది. విదేశాల నుండి ఎవరు వచ్చిన హోమ్ క్వారయింటైన్ లో ఉంచేలా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేశాం. మనకు చాలా బార్డర్ లు ఉన్నాయి రైల్వే ఎక్కువగా ఉంది ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే తో మాట్లాడము . రేపు ముఖ్యమంత్రులతో పీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉంది. దాన్ని పీఎంకు చెప్తామని సీఎం అన్నారు

మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల బార్డర్ లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రతి వాహనం ను చెక్ చేసి అందులో విదేశాల నుండి వచ్చిన వారిని హోమ్ క్వారన్తటైన్ లో ఉంచుతాం. ఇప్పటివరకు మన రాష్ట్రంలో వైరస్ వచ్చిన వారు మాత్రం ఇతర దేశాల నుండి వచ్చిన వారు మాత్రమే ఉన్నారు.

10వ తరగతి పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కువగా శానిటైజ్ చేయాలని చెప్పాము. కృత్రిమ కొరతలు సృష్టిస్తే కఠిన చర్యలు, ఎక్కడ కూడా షాప్స్ క్లోజ్ చేయటం లేదు. జనసమూహం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజలకు విజ్ఞప్తి.. జనసమూహం ఉండకుండా చూడండి. ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనే శక్తి ఉంది. అన్ని పెళ్లి మంటపాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ కార్యాలయాల లో యధావిధిగా ఉంటాయని సీఎం తెలిపారు.

- Advertisement -