- Advertisement -
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ బోడకుంటి విజయలక్ష్మి ద్వాదశదిన కర్మ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరై నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు.
అనంతరం బోడకుంటి వెంకటేశ్వర్లును ఓదార్చి, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వెంట రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.
- Advertisement -