వీరయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

134
cm
- Advertisement -

ప్రముఖ సినీ హాస్య నటుడు పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన గట్టు వీరయ్య, తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో అమితంగా అలరించారని సీఎం గుర్తు చేసుకున్నారు. వీరయ్య కుటుంబ సభ్యులకు సీఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య ‘అగ్గివీరుడు’ చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. దాసరి ప్రోత్సాహంతో తాతమనవడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. ‘రాధమ్మ పెళ్లి’, ‘జగన్మోహిని’, ‘యుగంధర్‌’, ‘గజదొంగ’, ‘గోల నాగమ్మ’, ‘అత్తగారి పెత్తనం’, ‘టార్జాన్‌ సుందరి’ తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు.

- Advertisement -