కోవిడ్ వైద్యసేవలు…బిల్లుల చెల్లింపుకు సింగరేణి గ్రీన్ సిగ్నల్

145
sccl
- Advertisement -

కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న సింగరేణి ఉద్యోగులు, మాజీలు అత్యవసర వైద్య సేవల కోసం సింగరేణి ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లోనే కాక ఇతర ఆస్పత్రిలో ఎక్కడ వైద్య సేవలు పొందినప్పటికీ నిర్ణయించ బడిన టారిఫ్ ప్రకారం వైద్యానికి అయిన ఖర్చులను కంపెనీ తిరిగి చెల్లిస్తుందని యాజమాన్యం తెలియజేసింది.

ఆదివారం నాడు డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ పేరుతో విడుదల చేసిన ఒక సర్క్యులరు ప్రకారం సింగరేణి కార్మికులు అధికారులు తో పాటు రిటైరైన అధికారులు కార్మికులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింప చేస్తున్నట్టు తెలియజేశారు.సింగరేణి సంస్థ హైదరాబాదు తో పాటు కరీంనగర్ వరంగల్ విజయవాడ తదితర పట్టణాల్లో గల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో వైద్య సేవల కోసం ఒప్పందాలు కుదుర్చుకుని ఎంపానెల్ మెంట్ చేసుకుంది . వీటిలో కొన్ని ఆస్పత్రులతో కోవేట్ వైద్య సేవల కోసం ప్రత్యేక టారిఫ్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది.

కోవిడ్ బారినపడిన వారు ఈ ఆసుపత్రిలో వైద్యం పొందినట్లయితే వారికి అయ్యే వైద్య సేవల ఖర్చులను సింగరేణి సంస్థ నేరుగా సదరు ఆసుప త్రులకు చెల్లిస్తోంది. అయితే ఇప్పటివరకు సింగరేణితో ఒప్పందం లేని ఆసుపత్రుల్లో ఒక వేళ కార్మికుడు వైద్యం పొందితే ఆ ఖర్చులనుమాత్రం కంపెనీ చెల్లించడం లేదు.

అయితే దీనిపై గుర్తింపు కార్మిక సంఘం వారు ఇటీవల ఒక విజ్ఞప్తి చేస్తూ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న ఉద్యోగి లేదా మాజీ ఉద్యోగి అత్యవసరంగా గా తనకు అందుబాటులో ఉన్న ఆసుపత్రులలో చేరే అవకాశంఉంది కాబట్టి అటువంటి సందర్భంలో కూడా కంపెనీ సదరు వైద్యసేవల ఖర్చులు చెల్లించాలని కోరింది.

దీనిని పరిశీలించిన సంస్థ చైర్మన్ మరియు ఎంపీ శ్రీధర్ సానుకూలంగా స్పందిస్తూ అత్యవసర పరిస్థితుల్లో సింగరేణి జాబితాలో లేని ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందినప్పటికీ వైద్య ఖర్చులను భరించడానికి అంగీకరించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ ఎస్ చంద్రశేఖర్ ఆదివారం నాడు ఒక సర్క్యులర్ జారీ చేశారు.

వైద్య ఖర్చులను హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) యొక్క టారిఫ్ ప్రకారం చెల్లించడం జరుగుతుందని, సింగరేణి తో ఒప్పందం కుదుర్చుకున్నఇతర అన్ని ఆసుపత్రుల్లో కూడా లాగే చెల్లి స్తున్నామని కంపెనీ పేర్కొంది .సింగరేణి సంస్థ ఈ విధంగా గా సింగరేణి సంస్థ తో ఒప్పంధం లో లేని ఆసుపత్రుల వద్ద అత్యవసర కోవిడ్ వైద్య సేవలు పొందినప్పటికీ దానికి అయ్యే ఖర్చులను చెల్లించడానికి అంగీకరించడం పట్ల కార్మికులు, అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -