టాలీవుడ్‌ నటుడు పొట్టి వీరయ్య మృతి..

268
Comedian Potti Veeraiah
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు పొట్టి వీరయ్య ఇకలేవరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య ‘అగ్గిదొర’ చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. దాసరి ప్రోత్సాహంతో తాతమనవడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.

- Advertisement -