కేంద్ర మంత్రితో సీఎం కేసీఆర్ సమావేశం..

129
CM KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం విదిత‌మే. కాగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ సమావేశమైయ్యారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిచారని సమాచారం. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు.

ఇక కేసీఆర్‌ పర్యటనలో భాగంగా 26న (ఆదివారం) ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం అవుతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివస్తారు.

- Advertisement -