గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు..

37
Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దసరా పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఉరికో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉప్పల్ చిలుక నగర్ ప్రభుత్వ పాఠశాలలో,హనుమాన్ దేవాలయం వద్ద టిఆర్‌ఎస్‌వీ జనరల్ సెక్రటరీ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జమ్మి మొక్కలు నాటారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని జమ్మి మొక్కలను నాటడం జరిగిందని ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన దసరా పండగ సందర్భంగా ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికి జమ్మి చెట్టు నాటించే కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగాలని కొరుకుంటు ఇందులో భాగంగా ఈరోజు జమ్మి మొక్కలను నాటడం సంతోషంగా ఉంది అని ప్రశాంత్ గౌడ్ తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి మెుక్కలను పంపిణీ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మిమొక్కలు నాటిన విద్యార్థులను మొక్కలు నాటేందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను ట్విట్టర్ వేదికగా అభినందించారు ఎంపీ సంతోష్ కుమార్.