ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇవ్వాలి-సీఎం కేసీఆర్‌

457
cm kcr
- Advertisement -

ఈ రోజు రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఆర్‌డీలో పంచాయతీరాజ్‌ శాఖపై విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ హజరై సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి 30 రోజుల ప్రణాళికపై క్షేత్రస్థాయి అధికారులకు సీఎం కేసీఆర్‌ కీలకమైన సూచనలు చేశారు.. ఈ నెల 6 నుంచి అన్ని పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు. పల్లెల రూపురేఖల మార్పే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే పంచాయతీకి ఒకరు చొప్పున మండలస్థాయి అధికారులకు ఇన్‌ఛార్జులుగా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయలని సీఎం సూచించారు.

kcr

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయితీలకు నిధుల కొరత ఉండదనీ, ప్రతీ గ్రామంలోనూ రాబోయే 6 నెలల్లోపు శ్మశాన వాటికలు నిర్మించాలనీ, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అవసరాల కోసం ట్రాక్టర్ సమకూర్చుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. 500 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రూ. 8 లక్షలు మంజూరు చేస్తామని ఆయన అన్నారు.

6వ తేదీ నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనీ, హరితహారంలో, ఇప్పుడు పంపిణీ చేసి నాటిన 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేననీ, లేని పక్షంలో సర్పంచ్‌లపై వేటు వేస్తామన్నారు. మిషన్ భగీరథతో తాగునీటి అవసరాలు తీరాయన్నారు. గ్రామాభివృద్ది తనిఖీ చేయడానికి వంద బృందాలను ఏర్పాటు చేస్తామనీ, 30 రోజుల ప్రణాళిక అనంతరం ఈ బృందాలు రంగంలోకి దిగుతాయన్నారు. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలిస్తామన్నారు. అలసత్వం, అజాగ్రత్త వహించిన గ్రామ సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తప్పవన్నారు.

kcr

కలెక్టర్లు, మండలస్థాయి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలనీ, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇచ్చి వాటిని సంరంక్షించేలా చూడాలన్నారు. ఖచ్చితంగా కృష్ణ తులసి మొక్క విధిగా ఇవ్వాలన్నారు. గ్రామ విస్తీర్ణానానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. పచ్చదనాన్ని కాపాడే కలెక్టర్లకు మార్కులుంటాయనీ, పట్టించుకోని కలెక్టర్లకు ప్రతికూల మార్కులుంటాయన్నారు.

- Advertisement -