గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం..

314
kcr meet governor
- Advertisement -

నేడు శాసనసభ వాయిదా పడిన అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ శాసనసభ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో కాసేపు సమావేశమయ్యారు. ఇరువురి మధ్య రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానంతరం జరిగిన పరిణామాల్ని సీఎం కేసీఆర్ నేడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్పటి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీటి వివరాలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. అలాగే శాసనసభ ప్రత్యేక సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక గవర్నర్ నియామాకానంతరం జరిగిన సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

- Advertisement -