హరిత యజ్ఞానికి శ్రీకారం..మొక్కలు నాటిన కేసీఆర్

236
CM KCR
- Advertisement -

తెలంగాణలో హరితహారం సైరన్‌ మోగింది.నాలుగో విడుత హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లి,ములుగులో మొక్కలు నాటారు. రాజీవ్ రహదారిపై ఆకాశమల్లె మొక్కను నాటిన సీఎం…. గజ్వేల్‌లో కదంబ మొక్కను నాటారు.సింగరాయపల్లె ఫారెస్ట్ ను సందర్శించారు.

గజ్వేల్‌లో రికార్డు స్ధాయిలో సైరన్ మోగగానే ఒకే సారి లక్షా 116 మొక్కలను నాటారు. గజ్వేల్ పరిధిలోని ప్రతి ఇంటి ఆవరణలో, రహదారులకు రెండు వైపులా, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రార్ధనామందిరాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాలలో మొక్కలు నాటారు.

అంతకముందు మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లిలో కేసీఆర్ కు ఎంపీ మల్లారెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మహిళలు ఘనస్వాగతం పలికారు.

గజ్వేల్ హరితహారం విజయవంతం కోసం 8 క్లస్టర్లుగా విభజించి ఏర్పాట్లు చేశారు అధికారులు. పండ్లు, పూల మొక్కలతోపాటు ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి వీలుగా చింత, మామిడి, అల్లనేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను ప్రత్యేకంగా తెప్పించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాని సినీ,రాజకీయాలకు అతీతంగా మంచి స్పందన వస్తోంది. సెలబ్రెటీలు విసురుతున్న గ్రీన్ ఛాలెంజ్ తో ప్రజల్లో మరింత చైతన్యం వచ్చింది.

- Advertisement -