రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు 24గంటల కరెంటు ఇస్తున్నాం. ఎన్ని కష్టాలు, నష్టాలకోర్చి పరిశ్రమలు, డొమెస్టిక్, గృహాలకు, కమర్షియల్, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణ.
హైదరాబాద్ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్ ఉండే కారిడర్ పటాన్‌చెరు నుంచి దిల్‌సుఖ్‌నగర్. పటాన్‌చెరువు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోరావాల్సి ఉంది. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుంది. మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నా అని అన్నారు. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెప్పాలి. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీని మంత్రి కేటీఆర్‌ను పంపిస్తాను. త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. భూపాల్‌రెడ్డి పదేపదే కోరుతున్నారు. రామసముద్రం చెరువు సుందరీకరించి గొప్పగా చేయాలని కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావుకు సూచిస్తున్నా అని అన్నారు.
Also Read: KCR:డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభం
కాలనీలు వచ్చిన వెంటనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాదు. అదనంగా సహాయం కావాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. మూడు మున్సిపాలిటీలకు రూ.30కోట్ల నిధులు, మూడు డివిజన్లకు రూ.30కోట్లు కేటాయిస్తున్నాం. 55 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా అభివృద్ధి కోసం సీఎం ఫండ్ నుంచి రూ.15లక్షలు మంజూరు చేస్తున్నాం. ఎప్పటి నుంచే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారు. త్వరలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని అన్నారు.
Also Read: శంకరమ్మకు సముచిత పదవి!