కేసీఆర్ హింట్..గుత్తాకు మంత్రి పదవి ఖాయం

850
gutha-sukender-reddy
- Advertisement -

గుత్తా సుఖేందర్ రెడ్డికి తాను ఎంపీ సీటు ఇవ్వలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆ వార్తల్లో నిజం లేదన్నారు సీఎం కేసీఆర్. మిర్యాలగూడలో టీఆర్ఎస్ ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడిన కేసీఆర్ గుత్తా త్వరలోనే అత్యున్నత పదవిని చేపట్టబోతున్నారని చెప్పారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించానని చెప్పారు.

వాస్తవానికి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లోకి చేరినప్పుడే గుత్తా సుఖేందర్‌కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గుత్తాకు మంత్రి పదవి కేటాయించలేకపోయారు సీఎం. కానీ కీలకమైన రైతు సమన్వయ సమితి బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీలో మంచి ప్రిపరెన్స్ ఇస్తూ వచ్చారు.

తాజాగా గుత్తాకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడంతోనే మంత్రి పదవి చేపట్టినట్లేనని ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా హింట్ ఇచ్చేశారు సీఎం.

నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా టీడీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా టీడీపీలో సీనియర్‌ నేతగా ఎదిగారు. మూడుసార్లు ఎంపీగా గెలిచి రాజకీయ ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్నారు. జిల్లా రాజకీయాల్లో గుత్తాది తిరుగలేని ఆధపత్యం. సీఎం కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన తన జీవితకాల కోరిక మంత్రి పదవిని త్వరలో నెరవేర్చుకోబోతున్నారు.

- Advertisement -