కే‌సి‌ఆర్ ‘హ్యాట్రిక్ సి‌ఎం’ పక్కా?

57
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బి‌ఆర్‌ఎస్ పార్టీనే పైచేయిగా నులవబోతుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్న ఎన్నికలు పూర్తయిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు మిశ్రమ ఫలితాలనే వెల్లడించాయి. అటు కాంగ్రెస్ పార్టీకి గాని, బి‌ఆర్‌ఎస్ కు గాని పూర్తి ఆధిక్యాని ఇవ్వలేకపోయాయి. దీంతో సర్వే సంస్థలు కూడా ఓటర్ నాడీ పట్టుకోవడంలో విఫలం అయ్యాయనే సంగతి స్పష్టంగా అర్థమౌతోంది. దీంతో డిసెంబర్ 3న వెలువడే ఫలితాలు సంచలనానికి దారి తీస్తాయనేది కొందరి రాజకీయవాదుల విశ్లేషణ. మొదటి నుంచి కూడా విజయంపై బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు..

ఈ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ విజయ ఢంఖ మోగించడం ఖాయమని, కే‌సి‌ఆర్ హ్యాట్రిక్ సి‌ఎంగా రికార్డ్ సృష్టిస్తారని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో కే‌సి‌ఆర్ రాష్ట్రాన్ని ఆగ్రపథంలో నిలిపారు. అన్నీ రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ ఒన్ గా నిలపడంలో కే‌సి‌ఆర్ సక్సస్ అయ్యారు. దాంతో తెలంగాణ ప్రజలు మరోసారి కే‌సి‌ఆర్ కు పట్టం కడతారని బి‌ఆర్‌ఎస్ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు ఇచ్చినప్పటికి అధికారంలోకి వచ్చేంత సీట్లు హస్తం పార్టీ సాధిస్తుందా అనేది ప్రశ్నార్థకమే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 40 లోపే సీట్లు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మూడోసారి కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకుల అంచనా. మరి డిసెంబర్ 3న వెలువడే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి..

Also Read:చలికాలంలో కీరదోస తింటే ఎన్నో ప్రయోజనాలో..!

- Advertisement -