మృణాల్ ఠాకూర్ పై ఓ బోల్డ్ బెడ్ సీన్

32
- Advertisement -

సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏమీ బాగాలేదు. ఓటీటీ సంస్థలు కూడా సినిమాలు కొనడం ఆపేశాయి. ఏవో భారీ బజ్ ఉన్న ఆ నలుగురైదుగురి బడా హీరోల సినిమాలను తప్ప, మిగిలిన సోది చిత్రాల పై ఓటీటీలు కన్నెత్తి చూసే పరిస్థితి ప్రస్తుతం లేకుండా పోయింది. ఇలాంటి టైమ్ లో ‘హాయ్ నాన్న’ అంటూ హీరో నాని ఓ సినిమా చేశాడు. పైగా ఎలాగైనా హిట్టు కోసం చాలా కసిగా వున్నాడు. చావో రేవో.. అన్నట్టు, హాయ్ నాన్న సినిమాపై నాని చాలా ఆశలే పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ఈ సినిమా చేశామంటూ నాని ఓపెన్ గా చెబుతున్నాడు.

కాకపోతే, ఇక్కడ ఓ సమస్య ఉంది. హీరో నాని మార్కెట్ కంటే కూడా ఎక్కువగానే హాయ్ నాన్న సినిమాకి బడ్జెట్ పెట్టేశారు. బజ్ మాత్రం ఒకింత డల్లుగా కనిపిస్తోంది. ఇంతలోనే, సినిమా కథ ఇదేనంటూ ఓ లీక్ బయటకు వచ్చింది. ఆ ట్విస్టు, ఈ ట్విస్టు.. అంటూ, హాయ్ నాన్న సినిమా గురించి హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. ప్రస్తుతం హీరో నానితో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు వరుసగా ఇస్తున్నారు. కానీ సినిమా పై హైప్ మాత్రం పెరగడం లేదు. అందుకే, సినిమాలో అసలు ట్విస్ట్ ఇదీ.. అంటూ కొన్ని లీకులు బయటకు వదులుతున్నారు.

హాయ్ నాన్న సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా రొమాంటిక్ గా ఉంటుందని.. సినిమాలోనే ఈ ఫ్లాష్ బ్యాక్ హైలైట్ గా ఉంటుందని లీకులు బయటకు వచ్చాయి. పైగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ – నాని ల మధ్య ఓ బోల్డ్ బెడ్ సీన్ కూడా ఉంటుందట. ఈ సీన్ లో మృణాల్ సెమీ న్యూడ్ గా కూడా నటించిందట. ప్రస్తుతం మృణాల్ టైమ్ నడుస్తోంది. నిజానికి సీతారామం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ మంచి పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది. మళ్ళీ, హాయ్ నాన్న సినిమాతో అలాంటి ఇంపార్ట్ చూపిస్తోందట. మరి ఈ లీకుల వల్ల అయినా హాయ్ నాన్నకు బజ్ వస్తోందేమో చూడాలి.

Also Read:30 ఏళ్లు అయినా ఇప్ప‌టికీ అదే గ్లామర్!

- Advertisement -