రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని, తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై చర్చజరుతుంది. వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి కేసీఆర్ లేఖ రాశారు.
ఈ సమీక్షలో మున్సిపల్, వ్యవసాయ, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు కె.టి. రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్ కో సీఎండి ప్రభాకర్ రావు, ఎస్ పిడిసిఎల్ సీఎండి రఘుమారెడ్డి, మున్సిపల్ వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్లను పాల్గొన్నారు.