పాలమూరుకు బయల్దేరిన సీఎం కేసీఆర్

369
Cm Kcr Helipad
- Advertisement -

సీఎం కేసీఆర్ నేడు పాలమూరులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈసందర్బంగా సీఎం కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో పాలమూరుకు బయల్దేరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు సీఎం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ తొలుత  మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెనకు చేరుకుంటారు. ఈ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని భూములను, కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం వట్టెం, అక్కడనుంచి నార్లాపూర్ రిజర్వాయర్ల వద్దకు చేరుకుంటారు.

నార్లాపూర్ వెళుతున్న సమయంలోనే ఇప్పటికే సాగునీరు అందిస్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) కాల్వలు, రిజర్వాయర్‌ను హెలికాప్టర్ నుంచే పరిశీలిస్తారు. నార్లాపూర్ వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్ ప్రాంతంలో పాలమూరు- రంగారెడ్డికి నీటిని ఎత్తిపోసే కోతిగుండు ప్రాంతం, రిజర్వాయర్ పనులను పరిశీలిస్తారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుల చేరుకుని అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలించడంతోపాటు అధికారులు, జిల్లామంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జెడ్పీ చైర్మన్లతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

- Advertisement -