పాయల్ ‘ఆర్‌డీఎక్స్ ల‌వ్’ టీజ‌ర్

282
rdx-love
- Advertisement -

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పొగొట్టింది బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో పాయల్ బాగా పాపులర్ అయ్యింది. ఈబ్యూటీ ఇప్పుడు ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో ప్రేక్షకుల మందుకు వస్తుంది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తేజు కంచ‌ర్ల మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.సెప్టెంబ‌ర్‌లో చిత్ర విడుద‌ల‌కి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక తాజాగా ఈచిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

లవ్ అండ్ హాట్ రోమాన్స్ తో మూవీని తెరకెక్కించారని టీజర్ ను చూస్తే అర్ధమవుతుంది. డబుల్ మీనింగ్ డైలాగ్ లు పాయల్ రాజ్ పుత్ అందాలు యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈమూవీ విడుదలకు సంబంధించిన తేదీని ఖారారు చేయనున్నట్లు తెలిపారు చిత్రనిర్మాతలు. ఈమూవీ టీజర్ మీకోసం..

- Advertisement -