మూసీ గేటు విషయంపై స్పందించిన సీఎం కేసీఆర్‌

236
cm kcr
- Advertisement -

మూసీ ప్రాజెక్ట్ ఆరో నంబర్ రెగ్యుటేరీ గేటు విషయం పై స్పందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మూసీ ప్రాజెక్టును సందర్శించాలని సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఈఎన్సీ మురళీధర్‌ రావును సీఎం ఆదేశించారు. పరిస్థితుల తీవ్రతను సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి ఫోన్‌లో వివరించారు.

అత్యవసరంగా తీసులోవాల్సిన చర్యల గురించి అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం హెలికాప్టర్‌లో సూర్యాపేటకు బయలుదేరనుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు.

- Advertisement -