పండరీపురానికి సీఎం కేసీఆర్..

46
- Advertisement -

సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు భారీ కాన్వాయ్‌తో ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గాన మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరనున్నారు.

మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లా ఒమర్గాకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకొంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్‌ బయలుదేరుతారు. రాత్రి సోలాపూర్‌లోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్‌ నుంచి పండరీపురం చేరుకుంటారు. విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Also Read:విటమిన్ డి తగ్గితే.. ఎన్ని ప్రమాదాలో!

తర్వాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలోనే సోలాపూర్‌ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Also Read:ప్రభాస్ కటౌట్..వాడుకునే దర్శకులు లేరా?

- Advertisement -