- Advertisement -
ఈ నెల 20 నుండి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల సంగతి పక్కనపెట్టి పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ పర్యటనల్లో కార్యకర్తలతో మాట్లాడి పార్టీలోని పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు వాటిని చక్కదిద్దుకునేందుకు చర్యలు తీసుకోనున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన వార్త కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. మరోవైపు మరిన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
ఇక జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు దిశగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కసరత్తు చేయించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, బీజేపీ మీద కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- Advertisement -