బిహార్‌కు సీఎం కేసీఆర్..!

67
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ రెండురోజుల పాటు బిహార్‌లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో బిహార్ వెళ్లనున్న సీఎం కేసీఆర్….ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్,డిప్యూటీ సీఎం తేజస్వితో భేటీకానున్నారు. గల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

బీహార్‌లో ఇన్నాళ్లూ బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్…ఆకూటమికి గుడ్ బై చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా ఆర్జేడీ చీఫ్‌ తేజస్వి యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి కూటమి ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్.. ఇప్పుడు బిహార్ నుంచే తన జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ప్రయత్నాలను ప్రారంభించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ బిహార్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

- Advertisement -