సీఎం కేసీఆర్‌ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది :తోట

47
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్‌ దెబ్బకు కేంద్రం దిగొచ్చందన్నారు ఆంధ్రప్రదేశ్‌ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడంలేదని కేంద్ర మంత్రి ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరికి తెలంగాణ సీఎం కేసీఆర్ దేవుడయ్యారని అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ తొలి విజయమని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నామని అన్నారు. ఈ ఉద్యమ సమయంలో 32మంది ఆత్మబలిదానాలు చేశారని అన్నారు. ప్రస్తుతం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ రూ.3లక్షల కోట్ల అని కానీ కేంద్రం రూ.397కోట్ల తప్పుడు లెక్కలు చూపించి ప్లాంట్‌ను అమ్మాలని చూశారని మండిపడ్డారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రత్యక్షంగా పరోక్షంగా 5లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రైవేటీకరణ చేస్తే దేశంలో రిజర్వేషన్లు ఎగిరిపోతాయని అన్నారు. కేవలం జాతి సంపదను కొందరికి మాత్రమే దొచిపెట్టాడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐఎన్ఎల్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని అన్నారు. పోలవరంకు ప్రాజెక్ట్కు ఆర్థికసహాయం చేయాలని అన్నారు. వైజాగ్ రైల్వే జోన్ వైజాగ్ మెట్రో దుగ్గరాజపట్నం పోర్ట్ కడప స్టీల్‌ప్లాంట్‌లను ఇప్పటి వరకు నేరవేర్చలేదని మండిపడ్డారు.

బైలదిల్లా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఎందుకు ఇవ్వదో అని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్ని నిజాలే చెప్పారని అన్నారు. హరీశ్‌రావుకు ఉన్న పరిజ్ఞానం ఆంధ్రమంత్రులకు లేదని ఎద్దేవా చేశారు. ఏపీ మంత్రుల దగ్గర సబ్జెక్ట్‌ లేదు సరుకు లేదని అనవసరంగా హరీశ్‌రావు పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో హరీశ్‌ మాట్లాడిన విషయాలు అన్ని కరెక్ట్‌ అని అన్నారు.

ఆంధ్రప్రజల కష్టాలను తీర్చగలిగేది కేవలం సీఎం కేసీఆర్‌ అని అన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని అన్నారు. కేసీఆర్ కేటీఆర్ విజన్‌ వల్లే తెలంగాణ మరింత ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ కాపాడిన సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు కార్మికసంఘాలు విజయోత్సవ సభను నిర్వహించాల్సిందిగా ఆంధ్రప్రజలు కోరుకుంటున్నట్టు అన్నారు.

ఇవి కూడా చదవండి…

KTR:సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు

Errabelli:బీజేపీ..దొంగల పార్టీ

KAVITHA:అతనెవరో నాకు తెలియదు: కవిత

- Advertisement -