- Advertisement -
నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
సచివాలయం ఆరవ అంతస్థులో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సూచనలు ఇవ్వనున్నారు.
Also Read:TTD:అత్యాధునిక టెక్నాలజీతో భద్రతా
ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.
- Advertisement -