మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే,టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు,కార్యకర్తలు హరీష్‌కు పుట్టినరోజు శుభాకాంలు చెబుతూ ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తున్నారు.
ఇక హరీష్ రావుకు సీఎం కేసీఆర్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్‌గా గుడ్ న్యూస్‌ని అందించారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం కీలకంగా మారిన హరీష్ రెండోసారి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రిపదవి దక్కలేదు.
అయితే ఇటీవల సీఎం కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ భేటీలో త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో చోటు ఖాయమనే సంకేతాలు ఇచ్చారట. హరీష్ బర్త్ డేకు కొద్దిరోజుల ముందు జరిగిన ఈ భేటీ అనంతరం ఆయన అనుచరులు ఇదే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. గులాబీ బాస్ తమ నాయకుడికి అడ్వాన్స్‌గా బర్త్ డే గిఫ్ట్‌ని అందించారని త్వరలో హరీష్ మంత్రి కాబోతున్నారని తెలిపారు.