ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ఆద్వర్యం లో లండన్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సీఎం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు మరియూ బి.ఆర్.యస్ ఆవిర్భావ దినోత్సవ వేవేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఎన్నారై బి.ఆర్.యస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి దాదాపు 150 కు పైగా ఎన్నారై భారస మరియు ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు.
సీఎం కెసిఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అన్ని మతాల దేవుళ్ళు ఆశీర్వదించాలని ముందుగా హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ మత ప్రతినిధులతో సర్వమత ప్రార్థన నిర్వహించారు. వారంతా పూజలు, ప్రార్థనలు చేసి కెసిఆర్ గారికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని, రాష్ట్రాన్నే కాదు రాబోయే రోజుల్లో దేశాన్నే నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించి ఆశీర్వచనం అందించారు. హాజరైన అతిథులంతా కూడా ఈ ప్రార్థనలల్లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్, ఎన్నారై బి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం గారు టెలిఫోన్ కాల్ ద్వారా అందరితో మాట్లాడడం జరిగింది కెసిఆర్ గారి నాయకత్వమే మనకు శ్రీరామ రక్షని, సందర్భం ఏదైనా వారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ సమాజాన్ని అనిల్ కూర్మాచలం గారు కోరారు. కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలని , దేవుడి ఆశీస్సులు ఎల్లపుడూ వారికి ఉండాలని అనిల్ కూర్మాచలం గారు ప్రార్థించారు.
ఎన్నారై బి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడే మన పాలకుడై నేడు సీఎం కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు మనకు ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అందుతున్న సంక్షేమ పథకాల్ని నేడు దేశమంతా అనుసరిస్తుందని, ఇక రాబోయే రోజుల్లో మన కెసిఆర్ గారు దేశానికి నాయకత్వం వహించాలని దేశం ఎదురుచూస్తుందని, ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు వారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి నిర్ణయం ఏదైనా వారి వెంటే ఉంటామని అశోక్ తెలిపారు.
దాదాపు పన్నెండు సంవత్సరాలుగా లండన్ లో కెసిఆర్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, నాడు లండన్ లో మాత్రమే నిర్వహించే వేడుకలు నేడు ప్రపంచమంతా జరుగుతున్నాయని, మాకెంతో గర్వంగా ఉందని, నిర్వాహుకులందరికీ, ప్రపంచవ్యాప్త ఎన్నారై బి.ఆర్.యస్ ప్రతినిధులకు అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు.తాను ఎక్కడున్నా మాకు అన్ని రకాల సూచనల్ని సలహాలనిస్తూ ఎన్నారైలకే స్ఫూర్తిగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఎన్నారై బి.ఆర్.యస్ వ్య్వవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కి అశోక్ ప్రత్యేక కృతఙతలు తెలిపారు. హాజరై కార్యక్రమాన్ని వియజవంతం చేసిన ఎన్నారై బి.ఆర్.యస్ నాయకులకు, కుటుంబసభ్యులకు, ఇతర సంస్థల ప్రతినిధులకు, ప్రవాసులు అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు.
ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ నేడు సర్వమత ప్రార్థనలు చేసి కెసిఆర్ గారిని ఆశీర్వదించిన అన్ని మతాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపి, మేమంతా కేవలం వేడుకలకే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రామాలు కూడా నిర్వహిస్తున్నామని రత్నాకర్ తెలిపారు.
ఎన్నారై భారస యూకే నాయకులు అబుజాఫర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి కెసిఆర్ గారు బాగుండాలని అల్లాని ప్రార్థించానని, అన్ని మతాల ప్రజల ఆశీస్సులు కెసిఆర్ గారికి ఉన్నాయని, నేడు కెసిఆర్ గారి వల్లే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉన్నారని అబుజాఫర్ తెలిపారు.
అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ సీఈక చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఖండాంతరాల్లో ఉంటూ భారస జెండా మోసే అవకాశం కలిపించిన కెసిఆర్ గారికి అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు ఇతర నాయకులందరికీ చంద్రశేఖర్ గారు కృతఙ్ఞతలు తెలిపారు.
ఎన్నారై భారస కుటుంబ సభ్యులంతా కేక్ కట్ చేసి కెసిఆర్ గారి 69 వ జన్మదిన వేడుకల్ని జరుపుకొని, హ్యాపీ బర్త్డే కెసిఆర్ సార్ , దేశ్ కా నేతా కెసిఆర్ , అభ్కి భార్ కిసాన్ కి సర్కార్….మేమంతా మీ వెంటే అంటూ నినదించారు. ప్రవాసులంతా కెసిఆర్ గారి జన్మదిన విందు భోజనాన్ని ఆనందించి నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శి హరి గౌడ్ నవాబుపేట్, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధి రవిప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి ఎన్నారై భారస నాయకులు మల్లా రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, గణేష్ పస్తం, సతీష్ రెడ్డి బండా, గణేష్ కుప్పలా, ప్రశాంత్ మామిడాల, సురేష్ బుడగం, ప్రవాస సంఘాల నాయకులు శుష్మునా రెడ్డి, స్వాతి బుడగం, ప్రవళిక భువనగిరి, స్నేహ, నంతిని తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..