వంటమనిషి పెళ్లికి సీఎం కేసీఆర్.. మధుర జ్ఞాపకం అంటున్న బాల్క సుమన్

446
Cm Kcr Attend Marraige
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన సింప్లిసిటిని చాటుకున్నారు. సెలబ్రెటీల పెళ్లిలకే కాదు..తన వద్ద పనిచేసే వాళ్ల పెళ్లిలకు వెళ్తుంటారు సీఎం కేసీఆర్.  సీఎం ఇంట్లో వంట పనిచేసే వ్యక్తి పెళ్లికి హాజరై ఆశిస్సులు అందించారు. గతేడాది జరిగిన ఈవివాహనికి సీఎం కేసీఆర్ హాజరవ్వగా…  తాజాగా ఈవిషయాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ట్వీట్టర్ ద్వారా  గుర్తుచేశారు.

“పెళ్ళికొడుకు ఏ రామోజీ మనవడో, అంబానీ తమ్ముడో కాదు… ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దగ్గర వంటపని చేస్తాడు. అతని వివాహానికి హాజరై ఇలా ఆత్మీయాలింగనం తో జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్”. తన వద్ద పనిచేసే వారి వివాహాలకు వెళ్లడం సీఎం కేసీఆర్ కు ఇది కొత్త కాదు…గతంలో చాలా మంది పేద వారి పెళ్లిలకు హాజరయ్యారు. ఈ పెళ్లికి సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ్య సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్  పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -