ఇస్మార్ట్ శంకర్ తో ముచ్చటగా మూడోసారి..

245
ram kishore Thirumala

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈమూవీని పూరీ, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటివలే రామ్ పుట్టిన రోజు సందర్బంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ ను విడుదల చేశారు. ఈటీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ లో ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక రామ్ తన తర్వాత మూవీ ఎవరితో చేస్తాడా అన్న విషయం గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం రామ్ తర్వాతి సినిమాకు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది. రామ్ కు సరైన సమయంలో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి వంటి హిట్లను అందించిన కిషోర్ తిరుమలతో రామ్ మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈసినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు తెలుస్తుంది. వచ్చె నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుగనుందని సమాచారం. ఇక కిషోర్ తిరుమల ఇటివలే తెరకెక్కించిన చిత్రం చిత్రలహరి. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్న తేజ్ ఈసినిమాతో హిట్ సాధించాడు.