రెడీ.. రెడీ.. అంటూ రెచ్చిపోయిన తమన్నా.. వీడియో

237
Tamannah

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా 2016లో వచ్చిన చిత్రం ‘అభినేత్రి’. సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌ఫుల్‌ మూవీకి సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

రొమాంటిక్ యాంగిల్లో హీరోను రెచ్చగొడుతూ హీరోయిన్ పాడే హుషారైన పాట ఇది. మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కంపోజ్ చేశారని చెప్పొచ్చు. తమన్నా గ్లామర్ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తమిళం, తెలుగులో ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు.

Abhinetry 2 | Ready Ready Video Song | Prabhu Deva, Tamannaah |Sam C.S. | Vijay