కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వెనుక ఎంతో మేథోమథనం ఉందన్నారు. మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం..తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లా పర్యటించిన సమయంలో అనేక జ్ఞాపకాలు. ఆలంపూర్ నుంచి జోగులాంబ వరకు పాదయాత్ర తెలంగాణ ఉద్యమంలో తొలిభాగంలో చేస్తే అనేకమైన అనుభవాలు, బాధలు..నడిగడ్డలో ప్రజల పరిస్థితి చూసి నిరంజన్‌రెడ్డి, నేను అంతా కండ్లనీళ్లు పెట్టుకున్నాం అన్నారు. కానీ ఈ రోజు చాలా సంతోషంగా ఉందని పంటల కోతలు కోసే హార్వెస్టర్లు, కల్లాల్లో ధాన్యం రాశులు చూసి ఆనందపడ్డానని తెలిపారు.
ఏడేళ్ల కిందట చాలా భయంకరమైన కరెంటు బాధలు అనుభవించిన తెలంగాణ నేడు.. దేశానికే తలమానికంగా, మనకు సమీపంలో ఏ రాష్ట్రం లేనివిధంగా, నేషనల్ యావరేజ్ క్లోజ్‌గా లేకుండా దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అని అని తెలిపారు. ఎవరం కూడా వెయ్యి సంవత్సరాలు బతికేందుకు రాలేదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకాయన అటెండర్ కావొచ్చు. ఒకాయన ఎమ్మార్వో, ఇంకో ఆయన జాయింట్ కలెక్టర్, ఒకాయన మంత్రి, మరొకాయన సీఎస్, మరొకాయన చీఫ్ మినిష్టర్ కావొచ్చు. ఇవి శాశ్వతం కాదు అన్నారు.
పీవీ నర్సింహరావు తెలంగాణగడ్డలో పుట్టి ప్రధాని స్థాయి వరకు ఎదిగారు. విద్యాశాఖ మంత్రి ఉన్న సమయంలో రెసిడెన్షియల్ పాఠశాలలే అద్భుతమైన ప్రగతికి దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లాలో సర్వేల్ రెసిడెన్షియల్ కాలేజీని పెట్టించారు. బీసీల రెసిడెన్షియల్స్ ఇంకా విస్తృత పరచాల్సి ఉన్నది. రాబోయే వాటి సంఖ్యను మూడు నాలుగు రెట్లు పెంచుతాం అన్నారు.
టీఆర్‌ఎస్ గవర్నమెంట్ మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మధనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తాం. ఎవరో చెప్పారనో.. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో చేయం. పేదింటి ఆడబిడ్డలు ఎప్పుడైతే గర్భం దాల్చిన తర్వాత కూడా పని చేస్తారు. పని చేస్తే ఆ గర్భిణులకు, జన్మించే శిశువు మంచిది కాదు. ఎందుకు పని చేస్తరున్నరనే విషయంపై అధ్యయనం చేశాం అన్నారు.
ఇవి కూడా చదవండి..