టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం సంపూర్ణం..

281
- Advertisement -

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తైంది. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తయినట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యలు బులెటెన్‌ విడుదల చేశారు. దీంతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 102 కు చేరింది. ఈ రోజు మధ్యాహ్నం 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని విజ్ఞప్తిచేశారు.

CLP

స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియ, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని కూడా ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారని ఆయన తెలిపారు.

దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు.

- Advertisement -