ముక్కు నుంచి వ్యాక్సిన్.. ట్రయల్స్‌కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్!

162
nasal
- Advertisement -

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా మరో ముందడుగు పడింది. ఇప్పటికే పలు కంపెనీల టీకాలు అందుబాటులోకి రాగా తాజాగా ముక్కు నుండి వ్యాక్సిన్‌ వేసుకునే క్లీనికల్ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం.

ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కు టీకా ద్వారా వ్యాక్సినేషన్ అభివృద్ధి చేస్తుంది భారత్‌ బయోటెక్‌ సంస్థ. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్‌ 18ఏళ్ల నుంచి 60ఏళ్ల వయస్సు గల వారిపై విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది. దీంతో నాజల్‌ వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది.

డీబీటీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ నాజిల్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. వ్యాధి నిరోధక కణాలు ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించగానే ప్రతిఘటిస్తాయి.

- Advertisement -