లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తలసాని..

104
talasani

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ ఉదయం సతీసమేతంగా యాదాద్రికి వెళ్లిన తలసాని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. మంత్రి వెంట స్ధానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ఉన్నారు.