దర్యాప్తు సంస్థల తీరును తప్పుబట్టిన సీజేఐ

174
cji
- Advertisement -

దేశంలోని దర్యాప్తు సంస్థల తీరును తప్పుబట్టారు సీజేఐ రమణ. జార్ఖండ్ రాష్ట్రంలో ధ‌న్‌బాద్ అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి ఉత్త‌మ్ ఆనంద్ హ‌త్య కేసును సుప్రీంకోర్టుగా సుమోటోగా విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఇక ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీజేఐ. త‌మ‌కు ప్రాణహాని ఉందంటూ న్యాయ‌మూర్తులు ఫిర్యాదు చేసినా సీబీఐ స‌హా వివిధ‌ ద‌ర్యాప్తు సంస్థ‌లు స్పందిచ‌డం లేద‌ని, వారికి ఏమాత్రం సాయ‌ప‌డ‌టం లేద‌ని సీజేఐ విమ‌ర్శించారు.

న్యాయ‌మూర్తులు త‌మ‌కు బెదిరింపులు వ‌స్తున్నాయంటూ సీబీఐకి, ఐబీకి ఫిర్యాదు చేస్తే వారు స‌రిగా స్పందించ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడాల్సిన బాధ్య‌త తనపై ఉందని వెల్లడించారు. దర్యాప్తు సంస్థల తీరు మారాలని…కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.

గ‌త నెల 28న జార్ఖండ్‌లో ధ‌న్‌బాద్ అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి ఉత్త‌మ్ ఆనంద్ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయ‌నను ప్ర‌త్య‌ర్థులు వ్యాన్‌తో తొక్కించి చంపేశారు.

- Advertisement -