కష్టానికి తగ్గ ఫలితం ఇది:ఖుష్బూ

169
khushbu
- Advertisement -

అలనాటి అందాల తార ఖుష్బూ. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత బొద్దుగా మారిన ఖుష్బూ తాజాగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ప్రస్తుతం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది . సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఖుష్బూ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో స్ట‌న్నింగ్ ఫొటో షేర్ చేసింది. ఇందులో ఖుష్బూ చాలా స్లిమ్‌గా క‌నిపించి అంద‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా చేసింది. బరువు తగ్గాలన్న లక్ష్యంతో చేసిన హార్డ్‌వర్క్‌కి తగ్గ ఫలితం ఇది. ఫిట్‌గా ఉండాలనే ఈ హార్డ్‌వర్క్‌ అని చెప్పుకొచ్చింది ఖుష్బూ.

1997లో సుంద‌ర్ ని పెళ్లి చేసుకోగా వారికి అవంతిక, ఆనందిత అనే ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన ఖుష్బూ ఓటమి పాలైంది.

- Advertisement -