తెలుగు భాష కాదు…జీవన విధానం

87
cji
- Advertisement -

ఇంట్లో పెద్దలు పిల్లలతో తెలుగులో మాట్లాడాలని కోరారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ అంట్‌ గ్రీట్‌ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.

తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత అన్నారు. మాతృభాషను, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని…అమ్మ భాషలోని తియ్యదనం అనుభవించాల్సిందే.. మాటాల్లోనే చెప్పలేమన్నారు. పుట్టిన ఊరు, మట్టివాసన, మట్టి గుబాళింపును నెమరువేసుకోవాలని ఎన్‌ఆర్‌ఐలకు సూచించారు. తెలుగు సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని చెప్పారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్విస్తున్నాని అన్నారు. మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. తాను లా మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదివానని చెప్పారు. మాతృభాషలో చదివి తాను ఈ స్థాయికి వచ్చానని మరచిపోవద్దని సూచించారు.

- Advertisement -