- Advertisement -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. స్ధానికంగా రెండు ప్రత్యేక కోర్టులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం బుధవారం రాత్రే తిరుపతికి చేరుకున్నారు రమణ.
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులకు సంబంధించి ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు. ఎప్పటికప్పుడు కేసులను త్వరగా పరిష్కరించే ఉద్దేశంతో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. కోర్టుల ప్రారంభం తర్వాత ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించే సభలో తిరుపతి జిల్లా పరిధిలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులను ఉద్దేశించి రమణ ప్రసంగిస్తారు.
అనంతరం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరై వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి పురస్కారాలు అందజేస్తారు.
- Advertisement -