జ‌న‌గ‌ణ‌మ‌న కోసం పూజా ఎంత డిమాండ్ చేసిందో తెలుసా?

81
pooja
- Advertisement -

స్వ‌ల్ప‌కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర‌హీరోయిన్‌గా ఎద‌గిపోయింది అందాల భామ పూజా హెగ్డే. ఓ వైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న పూజా…తాజాగా త‌న నెక్ట్స్ ప్రాజెక్టుకు భారీగా రెమ్యూనరేష‌న్ పెంచేసింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘జనగణమన’ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా సినిమా షూటింగ్‌లో సైతం జాయిన్ అయింది పూజా.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా పూజా హెగ్డే భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం పూజా కెరీర్‌లో ఇదే తొలిసారి.

ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే పూజా హెగ్డేకు సంబంధించిన సీన్స్‌‌ను షూట్ చేస్తున్నారు.

- Advertisement -