15న సీజేఐ యాదాద్రి పర్యటన.. షెడ్యూల్ ఖరారు..

90
nv ramana
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం (15.06.2021) యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7 గంటలకు ఆయన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు మీదుగా యాదగిరిగుట్ట బయలుదేరుతారు.

పర్యటన వివరాలు..

ఉ. 7:00 హైదరాబాద్ నుంచి ప్రయాణం.
ఉ. 8:30 యాదాద్రి ఆగమనం (గుట్ట మీద కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి నేరుగా చేరుకుంటారు).
ఉ. 8:45- 9:14 స్వామి వారి దర్శనం,ఆశీర్వచనం.
ఉ. 9:15- 9:45 కొత్తగా పునర్నిర్మితం అవుతున్న ఆలయ సందర్శన.
ఉ. 9:45- 10:00 వీవీఐపీ అతిథి గృహంలో అల్పాహారం.
ఉ. 10:00 సౌలభ్యం మేరకు యాదాద్రి నుంచి తిరుగు ప్రయాణం (దారిలో ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్, యాదాద్రి టెంపుల్ సిటీ పరిశీలన).

ముందుగా అనుకున్నట్లు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీలు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతోపాటు యాదాద్రి పర్యటనకు వెళ్ళటం లేదు. అందుకు బదులుగా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు సీజేఐతోపాటు యాదగిరి గుట్ట పర్యటనలో పాల్గొంటారు.

- Advertisement -