కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలా?

7
- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడం ఏంటి? కోర్టు తీర్పులను పార్లమెంటు కూడా పక్కన పెట్టలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2021 సంవత్సరంలో ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టం అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రిబ్యునల్‌తో పాటు పలు ట్రైబ్యునల్లు రద్దు అవ్వడంతో, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మద్రాస్ బార్ అసోసియేషియన్ మరియు ఇతర వ్యక్తులు.

ఈ పిటిషన్ పట్ల విచారణ జరుపుతూ, గతంలో న్యాయస్థానం కొట్టివేసిన పలు నిబంధనలకు మళ్లీ స్వల్ప మార్పులు చేసి, కొత్త చట్టాలు తీసుకురావడం రాజ్యంగా విరుద్ధమని పేర్కొన్నారు జస్టిస్ బీఆర్ గవాయ్.

ఈ కేసు వాయిదా వేయాలని, ఇతర బెంచ్‌కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా, నా నుండి తప్పించుకుందామని, నేను పదవి విరమణ పొందే వరకు తీర్పు రావద్దని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు న్యాయమూర్తి. కేంద్ర ప్రభుత్వం కోర్టు తీర్పులను ఉల్లంఘించడం సరికాదని, ట్రైబ్యునళ్ల సంస్కరణ 2021 చట్టంలోని కీలక నిబంధనలను కొట్టివేస్తూ తీర్పును ఇచ్చారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్.

Also read:లంగ్స్‌ ఆరోగ్యం కోసం బ్రీతింగ్ చెక్!

- Advertisement -