దాల్చిన చెక్క నీరు తాగితే..లాభాలెన్నో!

51
- Advertisement -

దాల్చిన చెక్కను వంటింట్లో కూరలలో విరివిగా వాడుతుంటాము. ఇది కూరల రుచిని పెంచడంతో పాటు సువాసనను ఇస్తుంది. కాగా దీనిని కేవలం కూరలలోనే కాకుండా ఆయుర్వేదంలోనూ వివిధ రకాల ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దాల్చినచెక్కలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మాంగనీస్, రాగి, జింగ్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీకూడా మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సీన్లను బయటకుక్ పంపించడంలో దోహద పడతాయి. అయితే చెక్కనూ నేరుగా కూరల ద్వారాను లేదా నేరుగా తీసుకోవడం కంటే..దానియొక్క రసాన్ని నీరు రూపంలో తీసుకోవడం ఎంతో మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్కవేసి బాగా మరిగించి ఆ నీటిని కొద్దిగా చల్లార్చుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడూ ప్రతిరోజూ ఉదయం పడగడుపున తాగితే ఎన్నో ఎంతో మేలట. ఖాళీ కడుపు తో దాల్చిన చెక్క నీరు త్రాగితే ఉదర సంబంధిత సమస్యలన్నీ దురమౌతాయట. నెలసరి ఉన్న మహిళలు ప్రతిరోజూ ఉదయం దాల్చిన చెక్క నీరు త్రాగడం వల్ల నెలసరిలో వచ్చే అన్నీ రకాల సమస్యలు దురమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ఇంకా పురుషుల్లో వచ్చే అంగస్తంభన సమస్యనూ కూడా తగ్గిస్తుందట. ఇంకా దాల్చిన చెక్కలో కొలెస్ట్రాల్ నూ తగ్గించి గుండె వ్యాధులను నియంత్రించే గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ దాల్చిన చెక్క నీరు త్రాగితే ఎలాంటి గుండె సంబంధిత సమస్యలనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుణాలు ఉంటాయి. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతిరోజు దాల్చిన చెక్క రసం తాగితే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -