డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సీఐ..

238
- Advertisement -

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న వారి భరతం పట్టాల్సిన పోలీసులే తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోతున్నారు. ఇలాంటి సంఘటనే కామారెడ్డిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఆ ప్రాంత పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి సీఐగా పనిచేస్తున్న డి.కృష్ణ మద్యం తాగి నిజామాబాద్ నుంచి కామారెడ్డికి తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీంతో తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఆయనను ఆపి తనిఖీ చేయగా తాగినట్టు తేలింది. దీంతో తాను సీఐ నంటూ తనిఖీలు నిర్వహించిన సిబ్బందిపై వీరంగం సృష్టించారు.

drunk and drive

దీంతో అక్కడే ఉన్న ఎస్సై నాగరాజు ఉన్నతాధికారులను సంప్రదించగా, చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను ధర్పెల్లి నుంచి హెడ్ క్వార్డర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేశారు.

- Advertisement -