తెరుచుకున్న ఏసుక్రీస్తు సమాధి…

329
- Advertisement -

చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. ఈ సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సమాధిపై ఉన్న రాయిని పలువురు చర్చి మతపెద్దల సమక్షంలో పరిశోధకులు అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీ.శ‌. 1555లో స‌మాధిపై ఉంచిన పాల‌రాతిని ఆ త‌ర్వాత ఎన్న‌డూ క‌ద‌లించ‌లేదు.

Christs-Burial-Place-Expos

క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జీసస్ పార్ధివ శరీరాన్ని ఒక షెల్ఫ్ లేదా బరియల్ బెడ్ మీద ఉంచారు. అలా చేసిన మూడు రోజుల తర్వాత క్రీస్తు ఇక్కడి నుంచే పునరుత్ధానం చెందారని చెబుతారు. కాగా, క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించారు. దాని మధ్యలో సమాధి చుట్టూ ‘ఎడుక్యుల్’ పేరుతో చిన్న నిర్మాణం ఉంది. ఇందులో ఒకసారి అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 1808-1810 మధ్యలో దీన్ని చివరిసారిగా పునరుద్ధరించారు. తాజాగా దీనిని మరోసారి పునరుద్ధరించనున్నారు.

christ

చీఫ్ సైంటిఫిక్ సూపర్‌వైజర్ ప్రొఫెసర్ ఆండోనియో మోరోపౌలోవ్ నిర్దేశకత్వంలో నేషనల్ టెక్నాలకీ యూనివర్శిటీ ఆప్ ఎథేన్స్ పరిశోధకులు ఈ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ది హోలీ సెపుల్కర్‌ను కాన్‌స్టాంటైన్ చక్రవర్తి తల్లి సెయింట్ హెలీనా కనుగొన్నారని, నాలుగవ శతాబ్ది నుంచి ఒక చర్చి వెలసి ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరవడం వల్ల పరిశోధకులు మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.

Burial-Place-Exposed

క్రెస్త‌వుల విశ్వాసం ప్ర‌కారం క్రీస్తు 30 లేదా 33 సంవత్సరాల్లో స‌మాధి చేశారు.మ‌ర‌ణించిన మూడో రోజున క్రీస్తు పున‌రుత్థానం చెందాడ‌ని క్రెస్త‌వులు విశ్వ‌సిస్తారు. క్రీస్తు మ‌ర‌ణించిన మూడో రోజు త‌ర్వాత స‌మాధిని నూనెతో అభిషేకం చేద్దామ‌ని ఓ మహిళ వెళ్ల‌గా అక్క‌డ క్రీస్తుకు సంబంధించిన ఎలాంటి అవ‌శేషాలు ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది.

 

https://youtu.be/6USFGGULKCA

- Advertisement -