వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్, విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీ20 ఫ్లాట్ ఫామ్ కరేబియర్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సీపీఎల్ అంటేనే సంచలనాలు,క్రికెట్లోని మజాను ఆస్వాదించేందుకు చక్కని వేదిక.
ఈ టోర్నీలో గేల్ ప్రదర్శన అద్భుతం. తనదైన శైలీ ఆటతీరుతో ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను ఉచకోత కోశాడు గేల్. ఇక గేల్ క్రీజులో ఉంటే బౌలర్ల గుండెలో దడే. అలాంటి గేల్ తాను వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది సీపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిడం అభిమానులను నిరాశ పర్చింది.
2013లో సీపీఎల్ ప్రారంభంకాగా క్రిస్‌గేల్ 2,344 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జమైకా తలైవాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గేల్. అయితే 2020 సీపీఎల్ వేలంలో జమైకా…గేల్‌ని వదులుకుంది. తనను జమైకా వదులుకోవడానికి కారణంగా కోచ్ శర్వాన్ కారణం అని ఆరోపిస్తూ విమర్శలు గుప్పించారు గేల్. తనని శర్వాన్ వెన్నుపోటు పొడిచారని…అతడు కరోనా కంటే ప్రమాదకారని ఆరోపించాడు గేల్.